నేడు జరిగిన ఏపీ పీజీ సెట్ పరీక్షకు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. ఎచ్చెర్లలోని శివానీ కళాశాల పరీక్ష కేంద్రానికి మంగళవారం రవాణా సమస్యలతో సకాలంలో చేరలేక సుమారు 30 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేక బయటే ఉండిపోయారు. భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.