ఎచ్చెర్ల: లారీ ఢీకొని వృద్ధుడు మృతి

79చూసినవారు
ఎచ్చెర్ల: లారీ ఢీకొని వృద్ధుడు మృతి
ఎచ్చెర్ల మండలం చిలకపాలెం జాతీయ రహదారిపై ముగడ చిన్న లచ్చయ్య (74) ను లారీ ఢీకొని మృతి చెందాడని ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం రేగిడి ఆముదాలవలస మండలానికి చెందిన లచ్చయ్య తన సొంత పనుల కోసం లావేరు మండలం బుడుమూరు వచ్చి తిరిగి వెళ్లేందుకు వంతెన కింద నిలిచి ఉన్నాడు. అటువైపుగా వెళుతున్న లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్