ఎచ్చెర్ల డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం ఇంజినీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శుక్రవారం జరిగాయి. ఇందులో భాగంగా విద్యార్థులు నృత్యాలతో అలరించారు. వీసీ రజిని ఈ వేడుకల్లో పాల్గొని మాట్లాడుతూ ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. నాలుగేళ్లలో పారిశ్రామిక అవసరాలు దృష్టిలో పెట్టుకొని నైపుణ్యాలు నేర్చుకోవాలన్నారు. ప్రిన్సిపల్ రాజశేఖర్ పాల్గొన్నారు.