ఎచ్చెర్ల మండలం అల్లినగరం గ్రామంలో 'సూపరిపాలన తొలి అడుగు' కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు ఇంటి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. సీఎం చంద్రబాబుతోనే సూపరిపాలన సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.