కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా ‘సుపరిపాలన –స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో లావేరు మండల కేంద్రంలో సంబరాలు చేసుకున్నారు. ఎచ్చెర్ల సీనియర్ టీడీపీ నాయకుడు ముప్పిడి సురేశ్ అధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అనంతరం ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ ఛైర్మన్ తొటయ్యదొర, నాయకులు పాల్గొన్నారు.