ఎచ్చెర్ల: అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీ స్వాధీనం

67చూసినవారు
ఎచ్చెర్ల: అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీ స్వాధీనం
అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నామని ఎస్సై సందీప్ కుమార్ తెలిపారు. ఆదివారం రాత్రి ఎచ్చెర్ల మండలం జరజాం జంక్షన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో నరసన్నపేట నుండి విశాఖపట్నం వెళుతున్న లారీని తనిఖీ చేయగా పశువులు ఉన్నట్లు గుర్తించామన్నారు. లారీని అదుపులోకి తీసుకొని పశువులను విజయనగరం జిల్లా కొత్తవలస గో సంరక్షణ కేంద్రానికి తరలించామని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్