మహాత్మ జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు అన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని రామతీర్థం జంక్షన్ లోని ఫూలే విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి శుక్రవారం పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు. డీజీఎం ఆనందరావు, శ్రీనివాసరావు, బెండు మల్లేశ్వరరావు, పిసిని జగన్నాథం, లంక ప్రభాకరరావు, పిన్నింటి బానోజీ నాయుడు, గొర్లె శ్రీనివాసరావు, పైడి అప్పడుదొర, మండపాక కనకరావు ఉన్నారు.