లావేరు మండలం శిగురు కొత్తపల్లి పంచాయతీ వెంకట్రావుపేట గ్రామానికి 70ఏండ్లుగా ఉన్న స్మశానవాటికను ప్రక్క గ్రామమైన బెజ్జిపురం గ్రామస్థులు ఆ స్థలం తమదంటూ భూమిని దౌర్జన్యంగా చదును చేసారు. ఇదే సమయంలో గ్రామంలో గురువారం ఒకరు చనిపోగా దహన సంస్కారాలకు ఈ స్థలంలో చెయడానికి వీలు లేదని అడ్డుకున్నారు. దీంతో ఇరు గ్రామస్థులు మధ్య వాగ్వివాదం తలెత్తింది. అంత్యక్రియలను అడ్డుకోవడంతో మృతుని కుటుంభీకులు అందోళన చెందుతున్నారు.