ఎచ్చెర్ల వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు శుక్రవారం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి స్వామివారి దర్శనం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. ఆలయ అర్చకులు స్వామి వారి కండువా వేసి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు పులిహోర, చక్రపొంగళి ప్రసాదాలను ఏర్పాటు చేశామని సూర శ్రీనివాసరావు తెలిపారు.