లావేరు మండలం తాళ్ళవలస పంచాయతీ సుభద్రపురం గ్రామంలో గత కొద్ది రోజులుగా త్రాగు నీటికి కష్టాలు పడుతున్నారు. గ్రామంలో బోరు మరమ్మతులకు గురికావడంతో మంచి నీటి కోసం గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామానికి కొంత దూరంలో ఉన్న చేతి పంపు నుంచి మంచి నీటిని మోయవలసి వస్తుందని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు మంచి నీటి బోర్ కు మరమ్మతులు చేయండని వారు వేడుకుంటున్నారు.