ఎచ్చెర్ల: ఎస్. ఎం. పురం గ్రామ సచివాలయం ఉద్యోగిపై దాడి

78చూసినవారు
ఎచ్చెర్ల: ఎస్. ఎం. పురం గ్రామ సచివాలయం ఉద్యోగిపై దాడి
ఎచ్చెర్ల మండలం ఎస్. ఎం. పురం సచివాలయం సంక్షేమ సహాయకుడు పైల విష్ణుపై దాడి జరిగింది. ఎస్బిఐ ఎచ్చెర్ల శాఖ నుంచి శుక్రవారం పింఛన్ల నగదు 24. 64 లక్షలు నగదు విత్ చేసి తీసుకువస్తుండగా ట్రిపుల్ ఐటీకి వెళ్లే మార్గంలో ఇద్దరు యువకులు మాస్కులు ధరించి దాడి చేశారు. సమీపంలో గొర్రెల కాపర్లు ఉండటంతో దుండగులు పరారయ్యారు. ఎస్ఐ సందీప్ కుమార్ కేసు నమోదు చేసి ధైర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్