ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి జానపద గీతాల (సోలో ) విభజనలో శ్రీకాకుళంలోని త్రిబుల్ఐటి చెందిన విద్యార్థిని సూర్నీడి శిరీష రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి పొంది, న్యూ ఢిల్లీలో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ మేరకు శుక్రవారం డైరెక్టర్ కొక్కిరాల వెంకట ధన బాలాజీ పరిపాలనా అధికారి ముని రామకృష్ణలు ఆమెను ప్రశంసించారు