ఎచ్చెర్ల: స్పెషల్ డ్రైవ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

56చూసినవారు
ఎచ్చెర్ల: స్పెషల్ డ్రైవ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఎచ్చెర్లలోని డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పరిధిలో 2015 నుంచి 2019 వరకు డిగ్రీ అభ్య సించిన విద్యార్థుల కోసం స్పెషల్ డ్రైవ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ను యూనివర్సిటీ డీన్ పద్మారావు మంగళవారం విడుదల చేశారు. 2, 4, 6 సెమిస్టర్లకు గాను పరీక్ష ఫీజు మే 17లోగా చెల్లించాలన్నారు. జూన్ 10 నుంచి పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్