ఎచ్చెర్ల: అధ్యాపకులను అభినందించిన వర్శిటీ వీసీ

82చూసినవారు
ఎచ్చెర్ల: అధ్యాపకులను అభినందించిన వర్శిటీ వీసీ
ఎచ్చెర్ల: జాతీయ సామాజిక శాస్త్రాల పరిశోధక మండలి సహాకారంతో ఆంధ్రా యూనివర్శిటీ డా. బీఆర్ అంబేద్కర్ ఛైర్ నిర్వహించిన రెండు వారాల కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్(సి. బి. పి. )కు డా. బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంకు చెందిన నలుగురు అధ్యాపకులు హాజరయ్యారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 14వ తేదీ వరకూ జరిగిన ఈ కార్యక్రమంకు హాజరై బోధన మెళుకవులు, డిజిటల్ ఇండియా, పరిశోధన నైపుణ్యత, అంబేద్కర్ ఆలోచనలు, సామాజికన్యాయం , సమానత్వం, సాధికారత తదితర అంశాలుపై శిక్షణ పొందారు.

సంబంధిత పోస్ట్