స్ఫూర్తి పేరుతో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన డా. బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం 17వ వార్షికోత్సవం ఉత్సహంగా కొనసాగింది. వర్శిటీ క్రీడా మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు సంప్రదాయ నృత్యాలతో వెస్టర్న్ బీట్స్ కు చేసిన డాన్సులు అతిథులకు, వీక్షకులకు ఆహ్లాదాన్ని పంచాయి. వైస్-ఛాన్సలర్ ఆచార్య కె. ఆర్. రజని మాట్లాడుతూ క్యాంపస్ జీవితం ఎంతో విలువైనదని, లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఒక వేదికని అన్నారు.