ఎచ్చెర్ల మండలం కుశాలపురం గ్రామానికి చెందిన పైడి వరహాలమ్మ అనుమానాస్పదంగా మరణించింది. గురువారం ఉదయం గ్రామస్థులు బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఆమె మెడలోని బంగారు పుస్తెలతాడు కనిపించలేదని కుటుంబసభ్యులు తెలిపారు. పోస్టుమార్టు నిమిత్తం మృతదేహాన్ని సర్వజనాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.