ఎచ్చెర్ల: దేవి ఆశ్రమంలో రాజరాజేశ్వరి దేవికి పూజలు

64చూసినవారు
ఎచ్చెర్ల మండలం కుంచాల కూర్మయ్యపేట గ్రామంలో ఉన్న దేవి ఆశ్రమంలో రాజరాజేశ్వరీ దేవి అమ్మవారికి శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. వైశాఖ మాసం మూల నక్షత్రం శుక్రవారం కావడంతో అమ్మవారికి మంగళహారతులు అందజేశామని ఆలయ పీఠాధిపతి తేజో మూర్తుల బాల భాస్కర శర్మ తెలిపారు. ఈ క్రమంలో ముత్తైదువులతో సామూహిక కుంకుమ అర్చన కార్యక్రమాలు కూడా చేపడుతున్నామని పేర్కొన్నారు. ఆశ్రమానికి భక్తులు తరలివచ్చారు.

సంబంధిత పోస్ట్