జి. సిగడాం మండలంలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు జి. సిగడాం, బాతువ, గెడ్డ కంచరాం, నడిమివలస, సేతు భీమవరం, గోబ్బూరు, నిద్దాం, అద్దోనంపేట, చెట్టు పొదిలం, మదుపాం, వెలగడ, చంద్రయ్యపేట, గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్టు ఎలక్ట్రికల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి. యోగేశ్వరరావు తెలిపారు. విద్యుత్ లైన్లు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్టు తెలిపారు.