లావేరు మండలంలోని బుడుమూరులో ఉరుములతో కూడిన వర్షం పడింది. పిట్ట అప్పయ్య ఓ చెట్టు కింద ఆవులు కట్టి ఉంచగా, ఈ క్రమంలో పిడుగు పడటంతో శుక్రవారం 4 ఆవులు మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. ఆవుల మృతితో బాధిత కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. వాటిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.