లావేరు మండలం, రావివలస గ్రామంలో ఆదివారం తెల్లవారు జామున సిరుగుడి నారాయణప్పారావు అనే రైతు యొక్క మూడు గడ్డి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు అంటించడంతో అగ్నిలో కాలిపోయిన గడ్డి కుప్పలు. విషయాన్ని గమనించిన గ్రామస్థులు అగ్నిమాపక కేంద్రానికి తెలియపరచగా అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే పూర్తి స్థాయిలో గడ్డి కుప్పలు కాలిపోవడంతో లబో దిబో మంటున్న కుటుంబసభ్యులు.