చిన్న వర్షానికే గ్రామీణ ప్రాంతాల రోడ్లు బురదమయమవుతూ ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. లావేరు మండలం గురుగుబిల్లి నుంచి బట్టుపాలెం మీదుగా చిన్నకోత్తకోట, పెద్దకోత్తకోట, ఇజ్జాడపాలెం వరకు రహదారులు పూర్తిగా దుర్భరంగా మారాయి. కూటమి ప్రభుత్వం పంచాయతీలకు నిధులు కేటాయిస్తుండటంతో గ్రామాల్లో రోడ్లు, కాలువలు త్వరగా పక్కాగా చేస్తారన్న ఆశ ప్రజల్లో ఉంది.