లావేరు మండలంలోని సిగిరికొత్తపల్లి పంచాయతీ వెంకట్రరావుపేట గ్రామంలో రెవెన్యూ సదస్సు శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీవో కె. సాయి ప్రత్యుష ఆకస్మికంగా సందర్శించారు. సదస్సు వద్ద ఉన్న రైతులతో ఆమె మాట్లాడారు. భూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెవెన్యూ సదస్సు వలన కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించారు. తహసీల్దార్ వై. జోగారావు ఉన్నారు.