ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు నేటి నుంచి 5 రోజులపాటు అమరావతిలో ఉంటారని ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శాశనసభ సమావేశాలు నిమిత్తం సోమవారం అనగా నేటి నుంచి శుక్రవారం వరకు అమరావతిలోనే ఉంటారని పేర్కొన్నారు. మళ్ళీ ఈనెల 27వ తేదీ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారని, దీనిని నియోజకవర్గ కూటమి నాయకులు, ప్రజలు గమనించాలని సూచించారు.