శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొండములగాం పంచాయతీ ముక్తంపురం గ్రామంలో సీసీ రోడ్డును ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వరరావు బుధవారం ప్రారంభించారు. ఈ పనులకు రూ.28 లక్షలు ఖర్చవుతున్నట్లు తెలిపారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అనంతరం పంచాయతీ రైతులకు సబ్సిడీపై వరి విత్తనాలు పంపిణీ చేశారు.