విశాఖ రేసపువానిపాలెం వినాయకనగర్‌లో ఉంటున్న రణస్థలంకు చెందిన పిన్నింటి చంద్రశేఖర్ (26) తన ఇంటి కింద నివసించే 7వ తరగతి బాలికపై అత్యాచార యత్నం చేశాడు. చంద్రశేఖర్ స్విగ్గీ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండగా. ఇటీవల తన గదికి తీసుకెళ్లి బాలికను బలవంతం చేశాడు. ఈ విషయం బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. వారు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేశారు.