రణస్థలం మండలం పాత సుందర పాలెం కు చెందిన గురువు అసిరయ్య (69) ఈనెల 11న ఉపాధి పనులు ముగించుకున్న తర్వాత వెళుతుండగా తెగిపడి ఉన్న విద్యుత్ తీగను తాకటంతో అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ఆలస్యంగా తెలిసింది. రెండు రోజులగా ఇంటికి రాకపోవడంతో వేరే ఊరు వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. తర్వాత గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.