రణస్థలం మండలం వల్లభరావుపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి కెల్ల రామకృష్ణ తండ్రి సోములు ఇటీవల స్వర్గస్తులైనారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్ శనివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసే నివాళులర్పించారు.