ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు కావాలని జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వడ్డాది శ్రీనివాసరావు, ఆర్యవైశ్య కమిటీ సభ్యులు సుగ్గు సత్తిబాబు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును కోరారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి రణస్థలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు.