రణస్థలం మండలంలో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్స్టన్స్ లో ఈ నెల 21న జాబ్ మేళా జరగనుంది. ఈ మేళా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి సాయిరామ్ శుక్రవారం తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటాయని, పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు అర్హులని చెప్పారు.