రణస్థలం మండలం కమ్మసిగడాం గ్రామంలో కొలువైన శ్రీమహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు సతీమణి రజినీతో కలసి పందిరి రాట మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి కళ్యాణానికి ముందు పందిరి రాట వేయడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈనెల 7వ తేదీ నుంచి 9 వరకు జాతర నిర్వహిస్తున్నారు.