రణస్థలం: విద్యుత్ షాక్ తో ఉపాధి వేతనదారుడు మృతి

76చూసినవారు
రణస్థలం: విద్యుత్ షాక్ తో ఉపాధి వేతనదారుడు మృతి
రణస్థలం మండలంలోని పాత సుందరపాలెంకు చెందిన అసిరయ్య (69) ఈ నెల 11న ఉపాధి పనులయ్యాక ఇంటికి వస్తుండగా, తెగి పడిన విద్యుత్ తీగను గమనించకుండా కాలు పెట్టాడు. దీంతో ఆయనకు షాక్ వొచ్చి అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు రోజులు గడిచినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించగా, ఓ చెరువు వద్ద మృతదేహం కనిపించింది. ఎస్సై చిరంజీవి కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్