శ్రీకాకుళం: బంగారం చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

58చూసినవారు
శ్రీకాకుళం: బంగారం చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
వృద్ధ దంపతుల వద్ద ఉన్న బంగారం బ్యాగు దొంగిలించిన కేసులో ముగ్గురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎచ్చెర్ల మండలం సాకిపేటకు చెందిన రామలక్ష్మి, రమణలు ఈ నెల 5న ఆటోలో పీఎన్ కాలనీలో బంధువుల ఇంటికి వెళ్లారు. ఆటోలో ఉన్న మౌనిక, పెద్దింటమ్మ అనే మహిళలు రామలక్ష్మికి చైన పడిపోయిందని నమ్మించి బ్యాగు కత్తిరించి, ఆటో డ్రైవర్ హరికి అప్పగించారు. పోలీసులు వాహన తనిఖీల్లో వారిని పట్టుకున్నారు.

సంబంధిత పోస్ట్