రణస్థలం మండలం కమ్మసిగడాంలో ఈనెల 7వ తేదీ నుంచి జరగనున్న మహాలక్ష్మీ తల్లి జాతరకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు జేఆర్ పురం సీఐ అవతారం గురువారం తెలిపారు. తల్లిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉత్సవాలలో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్ఐ చిరంజీవి ఉన్నారు.