కంచిలి మండల కేంద్రంలో ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కూటమి పాలనకు ఏడాది పూర్తైన సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా టీడీపీ మండల కార్యదర్శి మాదిన రామారావు మాట్లాడుతూ ప్రజలకు మంచి పాలన అందించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నేతలు కురయ్య, హరిబాబు, రమణ పాల్గొన్నారు.