మండలకేంద్రమైన రణస్థలం నిత్యం వాహనాలు, జనసమూహం రద్దీగా ఉండే ఓ రహదారిపై శుక్రవారం ఉదయం రెండు తాబేలులు రావడంతో అటుగా వెళుతున్న ఓ ఉపాధ్యాయడైన రొంపివలస రామారావు అందరిలా నాకెందుకులే అని కాకుండా ఆమూగ జీవాలను పట్టుకుని సమీపంలోని కోనేరులో విడిచిపెట్టి జంతువులపై తన ప్రేమను చాటుకున్నారు. నిత్యం ఈయన ఏదో ఒక సమాజ సేవలో ఉండటం పరిపాటి.