ఎచ్చెర్ల మండలం తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న గార సింహాచలం శనివారం రాత్రి రణస్థలంలోని బంటుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తహశీల్దార్ విశాఖ రాష్ట్ర ఐఐసీలో జేఎంగా పదోన్నతిపై వెళ్తున్నందున ఎమ్మెల్యేను కలిశారు. అనంతరం ఎమ్మెల్యే ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.