ఎచ్చెర్ల మండలం తోటపాలెం పంచాయతీలోని హఖీనఖాన్ పేటలో సుమారు రూ. 56. 80లక్షల నిధులతో రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. జల్ జీవన్ మిషన్లో భాగంగా ప్రతీ ఇంటికి మంచినీటి సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ ఎకరాకు సాగునీరు అందే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.