సైకిల్ యాత్ర చేస్తున్న బీహార్ యువకుడికి సన్మానం

59చూసినవారు
సైకిల్ యాత్ర చేస్తున్న బీహార్ యువకుడికి సన్మానం
నుమద్ రేహిమ్ అనే బీహార్ యువకునికి రణస్థలం మండలం గుర్రాలపాలెం గ్రామస్థులు శనివారం ఉదయం సన్మానం చేశారు. బీహార్ నుంచి సైకిల్ పై భారతదేశం మొత్తం పర్యటిస్తున్న యువకుడుని రామతీర్థం జంక్షన్ కు రాగానే స్థానికులు ఆయనతో మాట్లాడారు. వివరాలు తెలుసుకొని అతని ఆత్మస్థైర్యాన్ని ప్రశంసించారు. జనపాల గోవిందరావు, గురు భవాని రమణ దొర, రాజా, రమేష్, మూర్తి సన్మానించారు.

సంబంధిత పోస్ట్