ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్ సెక్రటరీ వారు డిప్లొమా పారామెడికల్ కోర్సుల కన్వీనర్ కోటా దరఖాస్తులకు గడువు నవంబర్ 03 తేది వరకు పొడిగించారని బొల్లినేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.హెచ్. నాగేశ్వరరావు తెలిపారు. మేనేజ్మెంట్ కోటా సీట్లకు నవంబర్ 12 తేది వరుకు ప్రవేశలకు అవకాశం కల్పించారన్నారు. ఈ కోర్సులకు ఇంటర్ ఏ గ్రూప్ పాసైన విద్యార్థులు అర్హులని తెలిపారు. కోర్సు పూర్తి చేసిన వారికి ప్రభుత్వ మరియు ప్రవేటు సంస్థలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. తమ కళాశాలలో కన్వీనర్, మేనేజ్మెంట్ కోటా సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు తగు ధృవవపత్రాలతో దరఖాస్తు చేయాలని సూచించారు.
వివరాలకు 7680945357, 7995013422 నంబర్లను లేదా జెమ్స్ హాస్పిటల్ క్యాంపస్, రాగోలు, శ్రీకాకుళం నందు సంప్రదించవచ్చని తెలిపారు.