ఈసెట్‌లో సత్తా చాటిన పాలవలస అమ్మాయి

75చూసినవారు
ఈసెట్‌లో  సత్తా చాటిన పాలవలస అమ్మాయి
సోంపేట మండలం పాలవలసకు చెందిన గోకర్ల రక్షిత, ఏపీ ఈసెట్‌లో అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో రాష్ట్రవ్యాప్తంగా 17వ ర్యాంకు సాధించి ప్రతిభ చాటింది. అనకాపల్లిలో డిప్లొమా పూర్తి చేసిన ఆమె, భవిష్యత్‌లో రైతులకు సహాయపడే వినూత్న వ్యవసాయ యంత్రాలు రూపొందించాలన్న లక్ష్యంతో ముందడుగు వేసింది. తల్లిదండ్రులు పూర్ణచంద్రరావు, హేమలత ఈ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్