కంచిలి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి నుంచి ఇచ్ఛాపురం వైపు ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ఘటనపై కంచిలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.