సోంపేట మండలం పాలవలస గ్రామంలో బుధవారం పొలం పిలుస్తొంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి. నరసింహమూర్తి, ప్రవీణ్ కుమార్ వేరుశనగ పంట పొలాలను సందర్శించారు. పొలం పరిశీలన చేస్తూ వేరుశనగ విత్తనశుద్ధి వలన మొక్కలు తేటగా కనిపిస్తున్నాయని రైతులనుతెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతులు యస్. లక్ష్మీనారాయణ, రాజు, కేశవరావు, ఈశ్వరరావు పాల్గొన్నారు.