ఈనెల 17, 18, 19 తేదీల్లో కోల్కతాలో జరిగే జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఇచ్ఛాపురం క్రీడాకారులు శుక్రవారం పయనమయ్యారు. తైక్వాండో కోచ్ సీహెచ్. దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 19 మంది విద్యార్థులు ఓపెన్ నేషనల్ పోటీలలో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. శనివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఇక్కడ నుంచి బయలుదేరారు.