కంచిలి మండలం అర్జునాపురంలో పశువులను నిర్బంధించిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. గ్రామానికి వెలుపల కొండల మధ్య పశువులను అక్రమంగా నిర్బంధించారని సమాచారం అందుకున్న కంచిలి ఎస్ఐ పారినాయుడు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. 21 పశువులను స్వాధీనం చేసుకున్నారు. లండ రామారావు, దాసరి విశ్వనాథం, దుర్గాశి త్రినాథ్ పై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.