బాల కార్మికులను ప్రోత్సహించరాదు

74చూసినవారు
బాల కార్మికులను ప్రోత్సహించరాదు
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు తప్పవని సీడబ్ల్యూపీఓ గోపాలకృష్ణ హెచ్చరించారు. బాలకార్మికుల గుర్తింపు ప్రక్రియలో భాగంగా శుక్రవారం ఇచ్ఛాపురం పట్టణంలోని పలు మెకానిక్ గ్యారేజ్ లు, షాపులు తనిఖీ చేశారు. బాలకార్మికులను ప్రోత్సహించ కూడదని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మిక అధికారి విజయ్కుమార్, చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది ఎం. స్వాతి, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్