సోంపేట సముద్ర తీర ప్రాంతంలోని బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూండ్కర్ పర్యవేక్షించారు. సంబంధిత అధికారులతో కలిసి బీచ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. జిల్లా పర్యాటకలను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ పలు ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. బారువ బీచ్ ని కూడా టూరిజం ప్రదేశంగా మెరుగుపరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.