సోంపేట పట్టణంలోని యశోద నగర్ వాసులకు రోటరీ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు ఆధ్వర్యాన శనివారం మజ్జిగ పంపిణీ చేశారు. 85 రోజులుగా పాదచారులకు మజ్జిగ, తాగునీటిని పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ ఇ. లక్ష్మీనారాయణ, దున్న రమేష్కుమార్ పాల్గొన్నారు.