పోలీసు సిబ్బంది అప్రమత్తగా విధులు నిర్వహించాలని శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం ఇచ్ఛాపురం రూరల్ పోలీసు స్టేషను సందర్శించి, తనిఖీలు నిర్వహించారు. ముందుగా పోలీసు స్టేషన్ పరిసరాలు, నిర్వహించే పలు ముఖ్యమైన రికార్డులను పరిశీలించారు. సర్కిల్ కార్యాలయంలో గ్రేవ్ కేసుల దర్యాప్తును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం సిబ్బంది వివరాలపై ఆరా తీశారు.