సోంపేట ఎక్సైజ్ శాఖ సర్కిల్ ఇన్స్పెక్టర్గా జి వి రమణ బాధ్యతలను స్వీకరించారు. బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన ఆయన మాట్లాడుతూ ఇంతవరకు సోంపేట, ఇచ్చాపురం మొబైల్ సిఐగా తాను విధులు నిర్వహించానని వివరించారు. గతంలో ఇక్కడ సి ఐ గా పనిచేసిన కె బేబీ శ్రీకాకుళం డిస్టిలరీ వింగ్ కి బదిలీ అయ్యారని తెలిపారు. మద్యం అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, సిబ్బంది తనకు సహకరించాలని ఆయన కోరారు.