ఉపాధి హామీ పథకంపై గ్రామసభ

61చూసినవారు
ఉపాధి హామీ పథకంపై గ్రామసభ
కవిటి మండలంలోని మాణిక్యపురం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పంచాయతీ కార్యదర్శి అట్టాడ విజయ శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. సామాజిక తనిఖీలలో భాగంగా 37 పనులను గుర్తించామని, వీటిని రూ. 62 లక్షల నిధులతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ లలిత సాహు, ఎంపీటీసీ సత్యవతి సాహు, వైస్ సర్పంచ్ దేవరాజు సాహు, ఉపాధి హామీ సిబ్బంది నిలయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్